ఉచిత ఆఫీస్ 4.4 విడుదలైంది

ఖరీదైన ఆఫీస్ అప్లికేషన్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం లిబ్రేఆఫీస్. ఉచితంగా లభించే ఈ లిబ్రేఆఫీస్ సాఫ్ట్‌వేర్ విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరును ఉపయోగించి ప్రజా డాక్యుమెంటు ఫార్మాటు అయిన ఒపెన్ డాక్యుమెంటు ఫార్మాటులో మనం డాక్యుమెంట్లు తయారువేసుకోవచ్చు. అంతే కాకుండా
యమ్‌ఎస్‌ ఆఫీస్ ని ఉపయోగించి తయారుచేసిన డాక్యుమెంట్లను కూడా ఈ లిబ్రేఆఫీసును ఉపయోగించి మార్పులు చేసుకోవచ్చు. 
  ఈ మధ్య విడుదలైన లిబ్రేఆఫీసు 4.4 ని ఇప్పటి వరకు విడుదలైన వాటిలో అందమైనదిగా చెప్పవచ్చు. వాడుకరిని ఆకట్టుకునే పలు పైమెరుగులతో పాటు ఎన్నో ఉపయుక్తమైన విశిష్టతలతో విడుదలైన లిబ్రేఆఫీస్ 4.4 ముఖ్యమైన మార్పులను క్రింది చిత్రంలో చూడవచ్చు.
 థీం మార్చుకునే సదుపాయం ఉన్న లిబ్రే ఆఫీస్ 4.4 లో వచ్చిన పూర్తి మార్పుల వివరాలకు ఇక్కడ చూడండి. 
 సరికొత్త వెర్షను లిబ్రేఆఫీస్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింకుకు వెళ్ళండి.