తగ్గిన మోటో జి ధర

ఫ్లిప్‌కార్ట్ ద్వారా పది లక్షల ఫోన్‌లకు పైగా అమ్ముడుపోయి విశేష జనాధరణ పొందిన మోటో జి ఇప్పుడు తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. మోటో జి ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో రెండు వేలు తగ్గింపు ధరలో లభిస్తుంది. క్రింది లింకులో నుండి కొనుగోలు చెయ్యవచ్చు.

ఉచిత ఆఫీస్ అప్లికేషన్ కొత్త వెర్షను విడుదల

సాధారణంగా మనకి కనిపించే ఆఫీస్ అప్లికేషను ధర చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా మంది పైరేటెడ్ వెర్షను వాడుతుంటారు. దానికి చక్కని ప్రత్యామ్నాయాలు ఇప్పుడు మనకి చాలా ఉందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా లభించడంతో పాటు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అంతేకాకుండా కొత్త

మోటో జి అప్‌డేట్ వల్ల బ్యాటరీ సామర్ధ్యం మెరుగుపడిందా?

మొన్న విడుదలైన మోటో జి ఆండ్రాయిడ్ 4.4.4 వెర్షన్ కంటికి కనిపించే కొత్త ఫీచర్లను తీసుకొని రావడంతోపాటు ఫోన్ పనితీరు మరియు వివిధ బద్రతా పరమైన అంశాలలో మెరుగుపరచినట్టు అప్‌డేట్ చేంజ్‌లాగ్‌లో ఇవ్వబడింది. అయితే అప్‌డేట్ చేసిన తరువాత పనితీరు ముందులాగే బాగానే ఉండడంతో పాటు రెండు రోజులు వాడకం తరువాత గమనించిన

ఫైర్‌ఫాక్స్, తండర్ బర్డ్ కొత్త వెర్షన్లు విడుదల

ప్రముఖ ఒపెన్ సొర్స్ వెబ్ బ్రౌజర్ పైర్‌ఫాక్స్ కొత్త వెర్షన్ 31 విడుదలైనది. ఈ ఉచిత వెబ్ బ్రౌజర్‌ని విండోస్, లినక్స్, మాక్ మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్‌లో చేర్చిన ముఖ్య ఫీచర్లు కొత్త ట్యాబ్ పేజిలో సెర్చ్ మరియు డౌన్‌లోడ్ చేసుకున్న ఫైళ్ళలో మాల్‌వేర్లని నిరోదించడం. ఫైర్‌ఫాక్స్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్

చైనా ఆపిల్ నుండి మరో రెండు ఫోన్లు రాబోతున్నాయి.

చైనా ఆపిల్‌గా పిలవబడే Xiaomi విడుదలచేసిన Mi3 ఇంకా భారతదేశంలో వినియోగదారులను చేరుకోకుండానే(ఈ రోజు నుండి ప్‌కార్ట్ అమ్మకాలు మొదలైనాయి. మొదలైన 39 నిమిషాలలోనే స్టాక్ అయిపోయింది.) మరో రెండు చవక ఫోన్‌లను విడుదలచేయడానికి రంగం సిద్దం చేసుకుంది. ఈ ఫోన్‌లు కూడా ధర తక్కువగా ఉండి మంచి స్పెసిఫికేషన్‌తో

మీ మోటో జి ని అప్‌డేట్ చేసుకున్నారా?

తక్కువ ధరలో ఎగువ శ్రేణి ఫీచర్లని అందించి జనాధరణ పొందిన ఆండ్రాయిడ్ ఫోన్ మోటో జి. భారతదేశంలో ఫ్లిప్‌ఫార్ట్ ద్వారా విడుదలైన ఆరునెలల్లో పది లక్షల ఫోన్లు అమ్ముడైన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 4.3 తో మొదట విడుదలైనది. ఆ తరువాత గత పిబ్రవరిలో ఆండ్రాయిడ్ కిట్‌కాట్ 4.4.2 కి అప్‌డేట్ విడుదలచేసారు. తాజాగా ఇప్పుడు సరికొత్త

పది లక్షలు దాటిన మోటో జి ఫోన్ల అమ్మకాలు

గూగుల్, మోటోరోలా సంస్థల బడ్జెట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మోటోజి. మొదటిసారిగా ఎగువ శ్రేణి స్పెసిఫికేషన్ గల ఫోన్‌లను మధ్య శ్రేణి ధరలో అందించిన ఫొన్. అంతేకాకుండా గూగుల్ నెక్సస్ పరికరాల తరువాత వేగంగా ఆండ్రాయిడ్ అప్‌డేట్లు విడుదలయ్యే ఫోన్ కూడా ఇదే. విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఈ ఫోన్

స్మార్ట్ ఫొన్‌ కంపెనీలు జాగ్రత్త! మార్కెట్‌లో మీస్థానం గల్లంతుకావచ్చు.

చెల్లించే ధరతో పోల్చితే తక్కువ నాణ్యత, తక్కువ మన్నిక, తక్కువ స్పెసిఫికేషన్ గల ఫోన్‌లను  ఇప్పటి వరకు మాకు అందించిన దేశీయ, విదేశి కంపెనీలు జాగ్రత్త పడండి. ఎందుకంటే చైనా ఆపిల్ మీ మార్కెట్ ని కొల్లగొట్టడానికి వస్తుంది. అద్బుతమైన స్పెసిఫికేషన్‌లతో మంచి తయారీతో మీకన్నా తక్కువ ధరలో ఇప్పుడు మాకు అందుబాటులో ఉంది.

రేపటి నుండి 14000 రూపాయలకే ఈ ఐ ఫోన్

స్మార్ట్ ఫోన్లలో ఐ ఫోన్ కి ఉన్న ప్రత్యేకత అందరికి తెలిసినదే. ఫోన్ల నాణ్యత విషయంలో దీనినే ప్రామాణికంగా తీసుకుంటారు అనడం అతిశయోక్తి కాదు. నాణ్యత, పనితీరులలో ఏవిధంగా రాజిపడకుండా ఉంటుందో ధర కూడా అలానే ఉంటుంది. ధర బాగా ఎక్కువగా ఉండడం వలన ఇది సంపన్నుల ఫోను గానే ఉంటు వస్తుంది. ఇప్పటికి చాలా మందికి ఐ ఫోన్‌ కలల

బాగా అమ్ముడు పోతుంది కాని మోటో జి ఫోన్ బాగానే ఉందా?

ఈ సంవత్సరం పిబ్రవరి నెల మొదటివారంలో ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా అమ్మకాలు ప్రారంబించిన మోటో జి మొదటిరోజే ఇరవై వేల ఫోన్‌లు అమ్ముడు పోయినాయి. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా అమ్ముడుపోయి ఉండవచ్చని అంచనా. మోటో జి 8జిబి మరియు 16 జిబి స్టోరేజ్‌తో లభిస్తుంది. 8 జిబి ఫోన్ 12,499 మరియు 16 జిబి

టివీల్లో,పత్రికలలో ఎక్కడా ప్రకటనలు ఇవ్వకుండానే ఎందుకు మోటో జి/ఇ అలా అమ్ముడవుతుంది?

మోటో జి ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపించే ఫోన్‌. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మరియు ఫ్లిప్‌కార్ట్‌కి జీవం, మోటోరోలాకి భారతదేశంలో పునర్జీవం అందించిన ఫోన్‌. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మోటో జి/ఇ తో తమ మొదటి ఆన్‌లైన్ కొనుగోలు మొదలుపెట్టారు. మామూలు ఫోన్‌లలా అన్ని దుకాణాలలో కాదు బయట ఎక్కడా దొరకదు,

మీ ఫోన్‌కి ఆండ్రాయిడ్ అప్‌డేట్ రావడం లేదా?

       ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న పరికరాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంగా పేరు పొందినది ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టం. దీనిని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తయారుచేసి విడుదలచేస్తుంది. దానిని మొబైల్ తయారీదారులు వాళ్ళకి తగినట్టుగా మార్చుకొని వాళ్ల పరికరాలలో ఉంచి మనకు అమ్ముతారు. ఆవిధంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకి సంబందించిన పరికరాలు ఒక్క గూగుల్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు వారి పరికరాలతో పాటు అమ్ముతున్నారు. మరి గూగుల్ విడుదలచేసిన వెంటనే మనకి అప్‌డేట్‌లు రావడానికి మధ్యలో తయారీదారు ఉన్నాడు. వాళ్ళు గూగుల్ విడుదలచేసిన అప్‌డేట్‌ని తమ పరికరానికి తగినట్లు మార్చి దానిని పరిక్షించి విడుదలచేయడానికి సమయం తీసుకుంటుంది కనుక మనకు అప్‌డేట్స్ రావడం ఆలస్యం అవుతుంది. అయితే కొన్ని పెద్ద సంస్థలు వాటికున్న వనరుల వలన కొంత వరకు అప్‌డేట్స్‌ ఇచ్చినప్పటికి భవిష్యత్తు వ్యాపారం దృష్ట్యా కొన్ని రోజుల వరకే అప్‌డేట్స్ అందిస్తువస్తున్నాయి. ఇది కూడా ఆకంపెనీలకు ఖర్చుతో కూడుకున్న విషయం కనుక చాలా దిగువ శ్రేణి మొబైల్ తయారీదారులు అసలు అప్‌డేట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఫోన్‌తో వచ్చిన దానికంటే పనితీరు బాగాలేకపోవడం వంటి సమస్యలు ఎదురవడం మనం గమనించవచ్చు. అందువలన మనం ఫోన్‌ లేదా టాబ్లేట్ కొన్నపుడు కొంచెం ధర ఎక్కువైనా మంచి కంపెనీది కొనుక్కోవడం ఉత్తమం. 

నెక్సస్ 5 కి ఆండ్రాయిడ్ 4.4.4 అప్‌డేట్

          గూగుల్ తమ నెక్సస్ పరికరాలకు వెంటనే అప్‌డేట్లు విడుదలచేస్తుంది. అదే విధంగా ప్లే స్టోర్‌లో అమ్ముతున్న వివిధ కంపెనీల పరికరాలకు కూడా ఆయా కంపెనీలు త్వరగా అప్‌డేట్లు విడుదలచేసేటట్లు చూస్తుంది. ఇకపోతే గూగుల్ కాకుండా తమ పరికరాలకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ త్వరగా ఇచ్చే సంస్థలు మొటోరోలా, సోనీ, హెచ్‌టిసి, యల్‌జి తరువాత సాంసంగ్. ఆపిల్ గాని యమ్‌యస్ కానీ ఏ సంస్థ అయినా జీవితకాలం అప్‌డేట్స్ ఇవ్వలేదు. అదే విధంగా వెర్షన్ అప్‌గ్రేడ్ కూడా ఒకటి లేదా రెండు వెర్షన్‌లకు మాత్రమే ఇస్తారు. ఫోన్‌ విడుదలచేసిన సుమారు రెండు సంవత్సరాలు వరకు మాత్రమే అప్‌డేట్స్ విడుదలచేస్తారు. ఒకవేళ అంతకుమించి అప్‌డేట్స్ ఇవ్వడానికి సిద్దపడితే చాలా అధనపు భారం పడుతుంది తద్వారా భవిష్యత్తు ఆవిష్కరణలు లేక కంపెనీ మూత పడినా పడుతుంది. అందువలన కంపెనీలు పాత పరికరాలకు అప్‌డేట్స్ ఇవ్వడానికి ముందుకురావు.
            ఆపిల్ గాని యమ్‌యస్ కానీ లేని అవకాశం ఆండ్రాయిడ్‌కి ఉంది. అదే ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ కావడం. ప్రతి ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదలచేసిన వెంటనే గూగుల్ దానికి సంబందించిన సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండేటట్లు పెడుతుంది. దానిని వాడుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒత్సాహిక డెవలపర్లు లాభాపేక్ష లేకుండా వివిధ పాత పరికరాలకి కూడా కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ని అందుబాటులోకి తెస్తారు. దానిని అందరికి ఉచితంగా అందజెస్తారు. అందువలన మనం ఫోన్‌ కొనే ముందు దాని ధర మాత్రమే కాకుండా దాని నాణ్యత, ఫీచర్లు, తయారీదారు ఎవరు మరియు ఆ పరికరం ఎంత వరకు ప్రాచూర్యం పొందినదో చూసుకొని కొనడం ఉత్తమం. జనాధరణ పొందిన ఫోన్‌లకి కొత్త ఆండ్రాయిడ్ తీసుకొని రావడానికి డెవలపర్లు కూడా సానుకూలంగా ఉంటారు. అప్‌డేట్స్ నిలిచిపోయిన పరికరాలకు సరికొత్త ఆండ్రాయిడ్ ని రుచిచూపించే పలు ఆండ్రాయిడ్ రామ్‌లు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనం చెప్పుకోవలసింది సైనోజెన్‌మోడ్ గురించి. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ ఆధారంగా తయారు చేసినప్పటికి , అంతా ఆండ్రాయిడ్ లా ఉన్నప్పటికి ఈ సైనోజెన్‌మోడ్ని ఒకసారి వాడితే మన ఫోన్ కొన్నప్పుడు వచ్చే ఆండ్రాయిడ్ వాడాలనిపించదు.

రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్ విశేషాలు, చిత్రాలు

      ఇప్పుడు నడుస్తున్న ఆండ్రాయిడ్ వెర్షన్ 4.4 కిట్‌కాట్. ఈ కిట్‌కాట్ శ్రేణిలో 4.4.4 వరకు గూగుల్ విడుదలచేసింది. కాని ఇప్పటికి చాలామంది తయారిదారులు అసలు కిట్‌కాట్‌ ఆపరేటింగ్ సిస్టం తోటి మొబైళ్ళు విడుదలచేయడం లేదు. మోటోరోలా, సోనీ, హెచ్‌టీసి మరియు గూగుల్ నెక్సాస్ వంటి కొందరు కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం తో మొబైళ్ళు విడుదలచేయడంతో పాటు వాటికి 4.4.4 అప్‌డేట్ ని అందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా గూగుల్ మాత్రం తరువాతి వెర్షన్ తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్ యొక్క డెవలపర్ ప్రివ్యూని (ఆండ్రాయిడ్ యల్ గా వ్యవహరిస్తున్నారు) విడుదలచేసింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ కిట్ మరియు నెక్సస్ 5 నెక్సస్ 7 పరికరాలలో ఇన్‌స్టాల్ చేసుకొనే విధంగా సిస్టం ఇమేజిలను దాని సోర్స్ కోడ్‌ని విడుదలచేసింది. వాటికి సంబందించిన మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడాండి. ఈ ఆండ్రాయిడ్ యల్ కి ఏ తినుబండారం పేరు పెడతాడో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడాలి. పై రెండు పరికరాలు కలిగి ఉన్నవారు రాబోయే ఆండ్రాయిడ్‌ని ఇప్పుడే రుచిచూడవచ్చు.
ఆండ్రాయిడ్ యల్ ఇన్‌స్టాల్ చేయబడిన

     అసలు విశేషం ఏమిటంటే ఈ రాబోయే ఆండ్రాయిడ్‌లో చాలా ప్రత్యేకతలు మరెన్నో కంటికి కనిపించని, కనిపించే మార్పులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సాధారణ వినియోగదారుడికి ఉపయోగపడేది మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం. అభివృద్ది దశలో ఉన్న ఈ ఆపరేటింగ్ సిస్టంని 4.4.4 తో పోలిస్తే బ్యాటరీ సామర్ధ్యం 36% మెరుగైనట్లు చెపుతున్నారు. ఇది ఇంకా ప్రాధమిక దశలో ఉంది కనుక పూర్తి స్థాయిలో విడుదలయి సగటు వినియోగదారుని వరకు వచ్చేసరికి మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

నెక్సాస్ 5 ఫోన్‌లో కిట్‌కాట్ మరియు యల్ ఇన్‌స్టాల్ చేసినపుడు బ్యాటరీ సామర్ధ్యాన్ని చూపే గ్ర్రాఫ్
          నెక్సస్ 5 లో ఇన్‌స్టాల్ చేయబడిన ఆండ్రాయిడ్ యల్ ఆపరేటింగ్ సిస్టం చిత్రాలు (ఇంటర్ నెట్ నుండి సేకరించబడ్డాయి) మరిన్ని క్రింద చూడవచ్చు.

సరికొత్త హోం స్క్రీన్ మరియు బటన్‌లు


మార్చబడిన నోటిఫికేషన్ విధానము

మరింత సులభతరమైన క్విక్ సెట్టింగ్ ప్యానల్

అక్షరాల మధ్య ఎక్కువ కాళీ స్థలం కలిగిన కీబోర్డ్

సిస్టం సెట్టింగ్స్