ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా?

ఫైర్‌ఫాక్స్ తన కొత్త వెర్షను 34 తో ఫైర్‌ఫాక్స్ హలో అనే ప్లగిన్ మరియు అకౌంట్ రహిత వీడియో చాట్ సేవను ప్రారంభించినది. ఈ వెబ్ ఆర్‌టిసి అధారిత విడియో చాట్ కొత్త వెర్షను ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొన్న వారందరికి చాట్ బటన్ రావట్లేదు. ఎందుకంటే మొజిల్లా సంస్థ సర్వర్ పరిమితుల కారణంగా పది శాతం మంది వాడుకర్లకు మాత్రమే ఈ సేవను అందించబోతుంది. బవిష్యత్తులో అందరికి విడియో చాట్ సేవను అందించబోతుంది. అయితే మనం చిన్న సెట్టింగుని మార్చుకోవడం ద్వారా ఫైర్‌ఫాక్స్ హలోని చేతనం చేసుకోవచ్చు. about:config చిరునామాకి వెళ్ళి అక్కడ loop.throttled అన్న సెట్టింగుని false గా పెట్టి ఫైర్‌ఫాక్స్‌ని రిస్టార్ట్ చేసి పానల్ కస్టమైజ్ ఆప్షన్‌కి వెళ్ళి చాట్ గుర్తును మనకు కావలసిన దగ్గరికి లాగి పెట్టుకోవాలి. అది ఎలానో క్రింది విడియోలో చూడవచ్చు.

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు