గూగుల్ కొత్త అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

ఆండ్రాయిడ్ లాలిపప్ విడుదలచేసిన తరువాత గూగుల్ తన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లన్ని కొత్త మెటీరియల్ డిజైన్‌తో, కొత్త ఫీచర్లతో ఆకర్షణీయంగా తయారుచేస్తుంది. ఈ అప్లికేషన్‌లన్ని ఒకొక్కటిగా ప్లేస్టోర్ ద్వారా అందరికి అందుబాటులో రాబోతున్నాయి. ఉదాహరణకు రాబోయే జీమెయిల్ యాప్‌ ఒక్క జీమెయిల్ వాడుకోవడానికి మాత్రమే కాకుండా
యాహూ, అవుట్‌లుక్ వంటి మిగిలిన అన్ని మెయిల్ సర్వీసులని వాడుకోవచ్చు. అలాగే రాబోయే గూగుల్ కీబోర్డ్ యాప్‌తో తెలుగు వంటి భారతీయ భాషలు కూడా టైప్‌ చేసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ సరికొత్త ఫీచర్లతో విడుదలచేసే అన్ని అప్లికేషన్‌లను మనం ఇప్పుడే అంటే ప్లేస్టోర్‌లో రాక మునుపే వాడుకోవచ్చు.ఎపికే మిర్రర్ అను సైట్‌ నుండి గూగుల్ యాప్‌ల రాబోయే వెర్షన్‌లను ఎపికే ఫైళ్ళ రూపంలో దింపుకొని మన ఆండ్రాయిడ్ పరికరాల్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 

జీమెయిల్ తో ఇక అన్ని మెయిళ్ళు
తెలుగు ఆండ్రాయిడ్ కీబోర్డ్