ఉచిత అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్

సాధారణంగా చాలామంది వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఆర్ధిక లావాదేవీలను తమ కంప్యూటర్లలో చేసుకోవడానికి పేరుపొందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ల యొక్క పైరేటెడ్ వెర్షనుని లేదా ట్రయిల్ వెర్షనులు వాడుతుంటారు. ఇటువంటి వారు పైరేటెడ్ సాఫ్ట్వేరు వాడకుండానే ఉచిత ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్లను వాడి తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. అలా
ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది గ్నూకేష్. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేరు ఆండ్రాయిడ్ తో పాటు అన్ని ప్రముఖ ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. ఈ ఉచిత స్వేచ్చా సాఫ్ట్‌వేరు ఉపయోగించి వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఖాతాలు చక్కగా నిర్వహించుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ యొక్క కొన్ని ముఖ్య విశిష్టతలు.
  • మన రూపాయి తో పాటు పలు దేశాల కరెన్సిలకు మద్దతునిస్తుంది.
  • తెలుగుతో పాటు పలు ప్రపంచ భాషలకు మద్దతునిస్తుంది.
  • చెక్‌బుక్ మాదిరిగా ఉండే రిజిస్టరు.
  • పలు ఖాతాలను ఒకేసారి నిర్వహించుకోవచ్చు.
  • స్టాక్, బాండ్స్ మరియు మ్యూచువల్ పండ్ ఖాతాలను నిర్వహించుకోవచ్చు.
  • లావాదేవిలను ముందుగా షెడ్యూల్ చేసుకోవచ్చు.
  • లావాదేవీలను రిపోర్టుల రూపంలోను, గ్రాఫ్ రూపంలోను చూసుకోవచ్చు. 
మరిన్ని  విశిష్టతలు చూడడానికి మరియు సాఫ్ట్వేరును దింపుకోవడానికి గ్నూకేష్ వెబ్‌సైటు ను చూడండి. ఆండ్రాయిడ్ ఫోను వాడేవారు ప్లేస్టోరు నుండి ఉచితంగా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.