ఫేస్‌బుక్‌లో ఫేక్ వీడియోలు

ఫేస్‌బుక్ వాడుతున్నవారి సంఖ్య పెరుగడంతో పాటు పేస్‌బుక్‌ని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. వాటిలో ఒకటి ఫేక్ వీడియోలు. ఈ వీడియోలు మన స్నేహితులు మనతో పంచుకున్నట్టే న్యూస్ ఫీడ్‌లో కనిపిస్తాయి. ఇటువంటి వీడియోలు మన స్నేహితులు ప్రమేయం లేకుండా కూడా కొన్నిసార్లు షేర్ చేయబడుతుంటాయి.
సాధారణంగా ఈ వీడియోలు ఆకట్టుకునే చిత్రంతోటి (ప్రముఖుల, శృంగార, పెద్ద జంతువుల, ప్రమాధాల, పుకార్లకి సంబందించిన), ఆసక్తిని రేపే శీర్షికతో ఉండి( షాకింగ్, బ్రేకింగ్ మరియు ఎక్స్‌క్లూసివ్) వీడియోని చూడడానికి దానిమీద క్లిక్ చెయ్యవల్సి ఉంటుంది. మనం ఆ వీడియో చూడాలని దానిని నొక్కినపుడు అది మరొక పేజికి మనల్ని తీసుకువెళుతుంది. అక్కడ మీరు వీడియో చూడాలంటే సర్వే పూర్తిచేయాలని కాని, షేర్ చేయాలనికాన ( కొన్నయితే మనం నొక్కితే చాలు షేర్ అయిపోతాయి), అప్లికేషను లేదా ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయాలని కాని అడుగుతుంది. వీటిని హ్యాకర్లు సమాచారాన్ని దొంగిలించడానికి, వాళ్ళ సైటుకి హిట్స్ పెంచుకోవడం కోసం, మాల్‌వేర్ల వ్యాప్తికి వాడుకుంటారు.
వీటివలన కలిగే నష్టాలను ఒకసారి చూద్దాం.
  • అబద్దపు సర్వేలు మన వ్యక్తిగత వివరాలను అడగవచ్చు.
  • చెత్త అప్లికేషన్ మరియు ప్లగిన్‌లను ఇన్‌స్టాల్ చేయడం వలన మన ప్రమేయం లేకుండానే మనం ఫోస్టు చేసినట్లుగా అశ్లీల, అసభ్యకరమైన మెసేజిలు, పోస్టుల రూపంలో మన స్నేహితులకి పంపించడం వలన పరువు పోతుంది.
  • మాల్‌వేర్లను సిస్టంలో ఇన్‌స్టాల్ చేయడంతో పాటు వాటిని వ్యాప్తి చెందడాని మన సిస్టం ని వాడుకుంటాయి. 
మనం చేయవలసిందల్లా ఇటువంటి వీడియోలను నొక్కకుండా ఉండడం, ఒకవేళ పొరపాటున నొక్కితే వీడియో రాకుండా సర్వే, ప్లగిన్ మరియు షేర్ చేయమనడం వస్తే వెంటనే వాటిని మూసివేయడం. ఫేస్‌బుక్‌లో చెలామణిలో ఉన్న కొన్ని ఫేక్‌ వీడియోల చిత్రాలు క్రింద చూడండి.
 ఇవి కాక ఎన్నో చెత్త వీడియోలు ప్రతిరోజు మనకోసం ఎదురుచూస్తుంటాయి తస్మాత్ జాగ్రత్త.