స్మార్ట్ ఫొన్‌ కంపెనీలు జాగ్రత్త! మార్కెట్‌లో మీస్థానం గల్లంతుకావచ్చు.

చెల్లించే ధరతో పోల్చితే తక్కువ నాణ్యత, తక్కువ మన్నిక, తక్కువ స్పెసిఫికేషన్ గల ఫోన్‌లను  ఇప్పటి వరకు మాకు అందించిన దేశీయ, విదేశి కంపెనీలు జాగ్రత్త పడండి. ఎందుకంటే చైనా ఆపిల్ మీ మార్కెట్ ని కొల్లగొట్టడానికి వస్తుంది. అద్బుతమైన స్పెసిఫికేషన్‌లతో మంచి తయారీతో మీకన్నా తక్కువ ధరలో ఇప్పుడు మాకు అందుబాటులో ఉంది.
Xiaomi Mi 3 ఫోను
ఇప్పటికే చైనా, హాంకాంగ్, తైవాన్ మరియు సింగపూర్‌లలో కోటికి పైగా అమ్ముడు పోయిన Xiaomi కంపెనీ వారి ప్రతిష్టాత్మకమైన Mi 3 ఫోను భారతదేశంలో ఒక్క ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే ముందస్తు బుకింగ్ ఈరోజు నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోను ధర ముందు 15000 రూపాయల వరకు ఉండవచ్చని అన్నప్పటికి ఇప్పుడు 14000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఫోను ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ నెల 22 నుండి పంపించబడును. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి. Xiaomi కంపెనీ Mi 3 ఫోను తరువాత మరిన్ని పరికరాలు భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.