రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్ విశేషాలు, చిత్రాలు

      ఇప్పుడు నడుస్తున్న ఆండ్రాయిడ్ వెర్షన్ 4.4 కిట్‌కాట్. ఈ కిట్‌కాట్ శ్రేణిలో 4.4.4 వరకు గూగుల్ విడుదలచేసింది. కాని ఇప్పటికి చాలామంది తయారిదారులు అసలు కిట్‌కాట్‌ ఆపరేటింగ్ సిస్టం తోటి మొబైళ్ళు విడుదలచేయడం లేదు. మోటోరోలా, సోనీ, హెచ్‌టీసి మరియు గూగుల్ నెక్సాస్ వంటి కొందరు కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం తో మొబైళ్ళు విడుదలచేయడంతో పాటు వాటికి 4.4.4 అప్‌డేట్ ని అందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా గూగుల్ మాత్రం తరువాతి వెర్షన్ తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్ యొక్క డెవలపర్ ప్రివ్యూని (ఆండ్రాయిడ్ యల్ గా వ్యవహరిస్తున్నారు) విడుదలచేసింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ కిట్ మరియు నెక్సస్ 5 నెక్సస్ 7 పరికరాలలో ఇన్‌స్టాల్ చేసుకొనే విధంగా సిస్టం ఇమేజిలను దాని సోర్స్ కోడ్‌ని విడుదలచేసింది. వాటికి సంబందించిన మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడాండి. ఈ ఆండ్రాయిడ్ యల్ కి ఏ తినుబండారం పేరు పెడతాడో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడాలి. పై రెండు పరికరాలు కలిగి ఉన్నవారు రాబోయే ఆండ్రాయిడ్‌ని ఇప్పుడే రుచిచూడవచ్చు.
ఆండ్రాయిడ్ యల్ ఇన్‌స్టాల్ చేయబడిన

     అసలు విశేషం ఏమిటంటే ఈ రాబోయే ఆండ్రాయిడ్‌లో చాలా ప్రత్యేకతలు మరెన్నో కంటికి కనిపించని, కనిపించే మార్పులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సాధారణ వినియోగదారుడికి ఉపయోగపడేది మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం. అభివృద్ది దశలో ఉన్న ఈ ఆపరేటింగ్ సిస్టంని 4.4.4 తో పోలిస్తే బ్యాటరీ సామర్ధ్యం 36% మెరుగైనట్లు చెపుతున్నారు. ఇది ఇంకా ప్రాధమిక దశలో ఉంది కనుక పూర్తి స్థాయిలో విడుదలయి సగటు వినియోగదారుని వరకు వచ్చేసరికి మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

నెక్సాస్ 5 ఫోన్‌లో కిట్‌కాట్ మరియు యల్ ఇన్‌స్టాల్ చేసినపుడు బ్యాటరీ సామర్ధ్యాన్ని చూపే గ్ర్రాఫ్
          నెక్సస్ 5 లో ఇన్‌స్టాల్ చేయబడిన ఆండ్రాయిడ్ యల్ ఆపరేటింగ్ సిస్టం చిత్రాలు (ఇంటర్ నెట్ నుండి సేకరించబడ్డాయి) మరిన్ని క్రింద చూడవచ్చు.

సరికొత్త హోం స్క్రీన్ మరియు బటన్‌లు


మార్చబడిన నోటిఫికేషన్ విధానము

మరింత సులభతరమైన క్విక్ సెట్టింగ్ ప్యానల్

అక్షరాల మధ్య ఎక్కువ కాళీ స్థలం కలిగిన కీబోర్డ్

సిస్టం సెట్టింగ్స్