ఫోన్ రూట్ చెయ్యబడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

 రూట్ చేసిన ఫోన్ కూడా మామూలు ఫొన్ లాగే ఉంటుంది. దానిని గుర్తించడానికి ఫోన్ లో ప్రత్యేకమైన గుర్తులు ఏమి ఉండవు. సాధారణంగా కొత్తగా ఫోన్ కొన్నప్పుడు రూట్ అకౌంట్ లాక్ చేయబడి ఉంటుంది. మనం పాత మొబైల్ వేరే వాళ్ళ దగ్గర నుండి కాని ఆన్ లైన్ లో కాని కొన్నపుడు ఆ మొబైల్ రూట్ చేయబడి ఉందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే రూట్ చేసిన ఫోన్ లో ఏవైనా హనికర అప్లికేషన్లు (సమాచారాన్ని దొంగిలించే లేదా నాశనం చేసే) ఉంచి మనకి అంటగట్టవచ్చు. లేదా తక్కువ కాన్ఫిగరేషన్ ని ఎక్కువగా చూపించి మోసం చేయవచ్చు. అందువలన సెకండ్ హెండ్ పరికరాలు కొనే ముందు తప్పని సరిగా రూట్ చేయబడి ఉందో లేదొ చూసుకోవాలి. సాధారణంగా రూట్ చేయబడిన ఫోన్ లో "సుపర్ సు" అనే అప్లికేషన్ ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. దానిని బట్టి మనం రూట్ చేయబడిన ఫోన్ ని గుర్తించవచ్చు. కానీ కొన్ని పద్దతులలో సుపర్ సు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మొబైల్ కాని టాబ్లెట్ కాని రూట్ చేయబడిందో తెలిపే ఈ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసి తెలుసుకోవచ్చు. 


 ప్లే స్టోర్ నుండి రూట్ చెకర్ బేసిక్ అన్న అప్లికేషన్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ ఇన్ స్టాల్ అయిన తరువాత ఆ అప్లికేషన్ని తెరిచి "వెరిఫై రూట్ యాక్సిస్" అన్న బటన్ ని నొక్కితే మనకి మన డివైస్ రూట్ చేయబడిందో లేదో చూపిస్తుంది.