విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడే ఉచిత సాఫ్ట్ వేర్

  మానవాళి మనుగడకు ఆయువు పట్టయిన జీవశాస్త్ర ప్రయోగాలు కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ప్రయోగాలు మనిషి కంటికి కనిపించని సూక్ష్మ స్థాయిలో జరుగుతున్నాయి. సూక్ష్మ స్థాయి అణునిర్మాణలను మన కళ్ళ ముందు ఆవిష్కరించే ఈ ఉచిత సాఫ్ట్ వేర్ విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడుతుంది. ప్రముఖ 3D మోడలింగ్ ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ అయిన బ్లెండర్ పై నిర్నించిన ఈ బయో బ్లెండర్ కూడా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్. జీవ రసాయన విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడే విధంగా రూపొందించబడినది. బయో బ్లెండర్ ని ఉపయోగించి శాస్త్రీయ సమాచారం ఆధారంగా ఉన్నత ప్రమాణాలతో 3D అణు ఆకృతులను నిర్మించవచ్చు. అంతేకాకుండా విశ్వవ్యాప్త శాస్త్రజ్ఞుల మరియు పరిశోధకులచే ఏర్పరచబడిన ప్రపంచంలో అతి పెద్ద ప్రోటీన్ల సమాచార బాండాగారం అయిన ప్రోటీన్ డాటా బ్యాంక్ నుండి నేరుగా అణు ఆకృతులని నిర్మాణాలని వాటి సాంకేత పదం ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అణు నిర్మాణం, అమరికల ఆధారంగా అణు ధర్మాలను వాటి కదలికలను విశ్లేషించవచ్చు. బయో బ్లెండర్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు