మీ ఆండ్రాయిడ్ ఫోన్ తో యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయ్యాలనుకుంటున్నారా?

 సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు గూగుల్ ప్లే లో వెతికి సులభంగా ఎన్నో రకాల అప్లికేషన్లు ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకుంటారు. కాని గూగుల్ నిబంధనల వల్ల ప్లే స్టోర్ నుండి యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ అప్లికేషన్లు తొలగించబడినాయి. యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ అన్న అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మనం  యుట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ .apk అన్న ఫైల్ని పై లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ 3 మరియు తదుపరి వెర్షన్లలో పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ని ఉపయోగించి యుట్యూబ్ లో వీడియోలు ఏఏ ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నాయో ఆయా ఫార్మాట్లలో మనం వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీడియో నుండి ఆడియోని వేరుచేసి mp3 గా మార్చుకోవచ్చు.  
  "allow installing apps from unknown sources other than Google play" అన్న ఆప్షన్ని ఎంచుకొని తరువాత పైన డౌన్లోడ్ చేసుకొన్న .apk ఫైల్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ ని ఏదైనా అప్లికేషన్ యొక్క షేర్ ఆప్షన్లో నుండి తెరవవచ్చు. క్రింది చిత్రంలో చూపినట్లు యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

యుట్యూబ్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ పనిచేయు విధానము

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు