లిబ్రే ఆఫీస్ 4.0.3 విడుదలైంది


 డాక్యుమెంట్ ఫౌండేషన్ ఈరోజు లిబ్రే ఆఫీస్ యొక్క తరువాతి వెర్షన్ అయిన 4.0.3 ని విడుదలచేసింది. సుమారు వంద దోషాలు సరిచేయబడిన 4.0.3 విడుదల ప్రకటన ఇక్కడ చూడవచ్చు.

 ఉబుంటు, మీంట్ మరియు డెబియన్ వాడేవారు క్రింది ఇవ్వబడిన కమాండ్లను టెర్మినల్ లో నడపడం ద్వారా కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  •  sudo add-apt-repository ppa:libreoffice/libreoffice-4-0 
  • sudo apt-get update
  • sudo apt-get install libreoffice

ఆపరేటింగ్ సిస్టంలని గన్న ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది

 ఎన్నో ఆపరేటింగ్ సిస్టంలకు మూలంగా నిలిచిన ఆపరేటింగ్ సిస్టం డెబియన్. ఉబుంటు, మింట్ వంటి ప్రముఖ ఆపరేటింగ్ సిస్టంలతో పాటు ఎన్నో గ్నూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు దీనిని ఆధారంగా తయారుచేయబడినాయి. ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్ సిధ్దాంతాలకు అనుగుణంగా తయారుచేయబడిన డెబియన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో కెల్ల స్థిరమైనదిగా, బధ్రత గలిగినదిగా చెబుతారు. అన్నిరకాల కంప్యూటర్లలో (టాబ్లెట్లు, డెస్క్ టాప్, సర్వర్,ఇంటెల్, ఎఎమ్ డి, ఎఆర్ ఎమ్) పని చేస్తుంది. కనుక దీనిని యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టం అంటారు. సుమారు రెండు సంవత్సరాల ఆభివృధ్ది తరువాత డెబియన్ యొక్క తాజా వెర్షను 7.0 నిన్న విడుదలైంది. ఆధికార విడుదల ప్రకటనని ఇక్కడ చూడవచ్చు. 


ఆండ్రాయిడ్ కోసం లిబ్రే ఆఫీస్ రాబోతుంది

 ప్రపంచంలో ఎక్కువ పరికరాల్లో వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంగా ప్రసిధ్ది చెందిన ఆండ్రాయిడ్ కి ఇప్పటికే పలు ఆఫీస్ అనువర్తనాలు ఉన్నప్పటికి వాటిలో ఉచితంగా లభించేవి కొన్నే. వాటిలో అన్ని ఫార్మాటులకి మధ్దతు ఇవ్వగల ఉచిత ఆఫీస్ అనువర్తనాలు ఇంకా తక్కువ. డెస్క్ టాప్ ఆఫీస్ సూట్ లలో వాణిజ్య ఆఫీస్ అనువర్తనాలకి ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అయిన లిబ్రే ఆఫీస్ ఇప్పుడు ఆండ్రాయిడ్ కి కూడా ఆఫీస్ అనువర్తనాన్ని తయారుచేస్తుంది. అభివృధ్ది దశలో ఉన్న ఆండ్రాయిడ్ కోసం లిబ్రే ఆఫీస్ ని ఇక్కడ నుండి దింపుకోని ప్రయత్నించి చూడవచ్చు.
గూగుల్ నెక్సాస్ 7లో లిబ్రే ఆఫీస్