మీ బ్లాగు లేదా సైటుని పర్యావరణ హితంగా మార్చండి

 ఈ పోస్ట్ మన బ్లాగుని చూసే వారికి సహాయపడే విధంగాను, పర్యావరణానికి మేలు చేయునట్లు బ్లాగుని ఎలా మార్చుకోవాలో వివరిస్తుంది. మన పోస్ట్ లో ఉన్న ఉపయుక్తకరమైన సమాచారం చూసినవారికి నచ్చి దానిని తరువాత చదువుకోవడంకోసం వారు ఆ సమాచారాన్ని దాచుకోవాలనుకుంటే రకరకాల పద్దతులు వాడుతుంటారు. ఎటువంటి ప్రయాస పడకుండా మన బ్లాగులోనే ముద్రించుకోవడం లేదా పిడియఫ్ గా మార్చే బటన్ ని ఉంచడం వలన సమాచారాన్ని సంధర్శకుడు ముద్రించుకోవడం లేదా పిడియఫ్ కి అనుగుణంగా మార్చుకోగలిగితే మన బ్లాగుని చూసే వారికి సహాయపడినట్లే. అంతే కాకుండా ఆ సమాచారాన్ని ముద్రణకి అనువుగా అందించగలిగితే పేజిలను ఆదా చేయడం ద్వారా పర్యావరణానికి మేలుచేసినట్లే. ఈ చిన్న మార్పు మీ బ్లాగులో చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 
 మొదట http://www.printfriendly.com/button అన్న పేజికి వెళ్ళి అక్కడ చూపిన మూడు సోపానాలను పాటించడమే. మనం బ్లాగు అంటే బ్లాగరా, వర్డ్ ప్రెస్ అని ఎంచుకొని, బటన్ నమూనాని ఎంచుకోని, తరువాత ఆ పేజిలో క్రింద ఇవ్వబడిన స్క్రిప్టుని మన సైటు లేదా బ్లాగులో ఉంచడమే. 

ఈవిధంగా వచ్చిన కోడ్ ని క్రింద చూపినట్లు మన బ్లాగుకి చేర్చుకోవాలి.


డాష్ బోర్డ్ - లేఅవుట్ - గాడ్జెట్ని చేర్చు - HTML/Java script లో పైన కాపి తీసుకున్న కోడ్ ని ఉంచి మార్పులని బద్రపరుచుకోవాలి. అంతే ముద్రించుకోవడం లేదా పిడియఫ్ గా మార్చే బటన్ మీబ్లాగు సంధర్శకులకి సేవలందించడానికి సిధ్దంగా ఉన్నట్లే.


ఇలా పోస్ట్ చివరన ముద్రించుకోవడం లేదా పిడియఫ్ గా మార్చే బటన్ వస్తుంది. దానిని నొక్కినపుడు ఇలా బ్లాగు పేజి ముద్రణకు అనువుగా మార్చబడుతుంది.